యాప్నగరం

ధోనీ రిటైర్మెంట్ గురించి అతనికి మాత్రమే తెలుసు: పీటర్సన్

ధోనీ రిటైర్మెంట్, రీఎంట్రీ గురించి దాదాపు 10 నెలల నుంచి చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లతో పాటు అతని సహచర క్రికెటర్లు కూడా తమకి తోచిన అభిప్రాయాన్ని చెప్తున్నారు. కానీ.. ధోనీ మాత్రం మౌనంగా ఉండిపోతున్నాడు.

Samayam Telugu 15 May 2020, 8:05 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి అతనికి మాత్రమే తెలుసని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్‌కి పూర్తిగా దూరమైపోయాడు. దాంతో ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. లేదు అతను మళ్లీ ఈ ఏడాది టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu Chennai: CSK Skipper MS Dhoni during a practice session of the upcoming IPL 2020...


ధోనీ రీఎంట్రీ, రిటైర్మెంట్‌పై సందిగ్ధత నెలకొనగా కెవిన్ పీటర్సన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘‘భారత క్రికెట్‌కి ధోనీ సుదీర్ఘకాలం సేవలు అందించాడు. కాబట్టి.. రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలనేది అతనే నిర్ణయించుకోవాలి. అంతేతప్ప.. ఎవరూ నిర్ణయించకూడదు. ధోనీపై అంచనాలు ఎప్పుడూ పతాక స్థాయిలో ఉంటాయి. ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలో అతనికే తెలుసు’’ అని వెల్లడించాడు.

2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ‌ని కెప్టెన్‌గా గెలిచిన ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతను కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.