యాప్నగరం

నా రిటైర్మెంట్‌పై నీ సలహా ఏంటి..? రమీజ్ రాజాకి హఫీజ్ చురక

పాకిస్థాన్ క్రికెటర్ల రిటైర్మెంట్ ఎప్పుడూ వివాదమే. షాహిద్ అఫ్రిది ఎన్నోసార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మాలిక్, హఫీజ్ వయసు 40కి చేరువవుతున్నా రిటైర్మెంట్ ఆలోచనలు లేవంటున్నారు.

Samayam Telugu 15 Jun 2020, 8:39 pm
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌ రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించిన ఆ దేశ క్రికెట్ కామెంటేటర్ రమీజ్ రాజాపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షోయబ్ మాలిక్.. ఇద్దరం కలిసి ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించేద్దామంటూ మొట్టికాయలు వేయగా.. నా రిటైర్మెంట్‌పై నీ సలహా ఏంటి..? అనేలా మహ్మద్ హఫీజ్ కూడా స్పందించాడు. మాలిక్ వయసు 38 ఏళ్లుకాగా.. మహ్మద్ హఫీజ్ 39లో అడుగుపెట్టాడు. దాంతో.. యువ క్రికెటర్లకి పాక్ జట్టులో అవకాశం ఇవ్వడం కోసం రిటైర్మెంట్ ప్రకటించాలని రమీజ్ రాజా సూచించడమే తప్పు అయిపోయింది.
Samayam Telugu Mohammad Hafeez


రమీజ్ రాజా ఇటీవల ఏమన్నాడంటే..? ‘‘మాలిక్, హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి గౌరవంగా, హుందాగా తప్పుకోవాలి. ఒకవేళ.. ఇప్పుడు వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. పాక్ జట్టుకి మేలు చేసినవారవుతారు. చాలా మంది యువ క్రికెటర్లు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. కొంత మంది సీనియర్ క్రికెటర్లని పక్కన పెట్టి పాక్ జట్టు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు.

రమీజ్ రాజా వ్యాఖ్యలపై మహ్మద్ హఫీజ్ ఇలా స్పందించాడు. ‘‘రమీజ్ రాజా తన అభిప్రాయాలు చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ.. నా రిటైర్మెంట్ నిర్ణయం.. ఎవరో సలహాపై ఆధారపడి లేదు. ఇప్పటికీ పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ కోరితే త్వరలో ఇంగ్లాండ్ గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌‌లో ఆడేందుకు నేను రెడీ. వయసు ఆధారంగా ఆటగాళ్లని జట్టు నుంచి తప్పించకూడదు. టీమ్‌లోకి ఎంపిక, జట్టు నుంచి వేటు అనేది కేవలం ఫిట్‌నెస్, ఫామ్ ఆధారంగానే జరగాలి’’ అని హఫీజ్ సూచించాడు.

2003లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ హఫీజ్.. ఇప్పటి వరకూ 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో 21 శతకాల్ని హఫీజ్ నమోదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.