యాప్నగరం

పాక్ బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. వెంటనే అమల్లోకి!

పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది.

TNN 16 Nov 2017, 5:36 pm
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. అక్టోబర్లో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉందనే నివేదిక అందింది. దీంతో నవంబర్ 1న ఇంగ్లండ్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించారు.
Samayam Telugu pakistan bowler hafeezs bowling action found to be illegal
పాక్ బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. వెంటనే అమల్లోకి!


ఈ పరీక్షల్లో అతడు బంతిని విసిరేటప్పుడు 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో మోచేతిని వంచుతున్నట్లు తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలా బౌలింగ్ చేయడం కుదరదు. మూడేళ్ల వ్యవధిలో హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2014లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి హఫీజ్‌ని ఐసీసీ సస్పెండ్ చేసింది. మరుసటి ఏడాది ఏప్రిల్‌లో అతడు బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడు. కానీ కొద్ది నెలల తర్వాత లంకతో జరిగిన గాలే టెస్టులో మళ్లీ గతి తప్పాడు. దీంతో ఐసీసీ అతడు ఏడాదిపాటు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.