యాప్నగరం

హసన్ అలీ.. భారత్‌పై పది వికెట్లు పడగొట్టావా?

దాయాదుల మధ్య సమరం ఉత్కంఠగా సాగుతుందని భావిస్తే.. రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగా ముగిశాయి. టోర్నీ ఆరంభానికి ముందు ప్రగల్భాలు పలికిన పాక్ ఆటగాళ్లు, మాాజీలు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు?

Samayam Telugu 24 Sep 2018, 3:12 pm
ఆసియా కప్ తుది దశకు చేరింది. భారత్, పాక్ మధ్య ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు జరగా.. రెండూ ఏకపక్షంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా గెలుపు ఫ్యాన్స్‌కి సంతోషం కలిగించింది. కానీ దాయాది జట్ల మధ్య పోరు మాత్రం ఆశించిన స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు.
Samayam Telugu hasan ali


ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాక్ క్రికెటర్లు, మాజీలు తెగ ప్రగల్భాలు పలికారు. భారత జట్టుపై మెరుగ్గా రాణిస్తానని, పదికి పది వికెట్లు పడగొట్టాలని ఉందని హసన్ అలీ చెప్పుకొచ్చాడు. కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ మాటకొస్తే పాక్ బౌలర్లు తీసింది రెండంటే రెండు వికెట్లు. అది కూడా మొదటి మ్యాచ్‌లోనే.

దాయాది జట్ల మధ్య సమరానికి ముందు భారత బౌలింగ్ లైనప్‌ను కామెంట్ చేస్తూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు చేశాడు. ఫకర్ జమాన్ భారత్ బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కుంటాడని, డబుల్ సెంచరీ చేస్తాడని జోస్యం చెప్పాడు. కానీ తొలి మ్యాచ్‌లో డకౌటయిన జమాన్, రెండో మ్యాచ్‌లో 31 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆటగాళ్లు, మాజీలను టార్గెట్ చేస్తూ భారత క్రికెట్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.