యాప్నగరం

క్రికెటర్లకి కరోనా పాజిటివ్.. మెడికల్ స్టాఫ్ ఏం చేస్తోంది..?: హక్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెడికల్ స్టాఫ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో మహ్మద్ హఫీజ్ ప్రైవేట్‌గా కరోనా పరీక్షలు చేయించుకోగా.. అతనికి నెగటివ్ వచ్చింది. కానీ.. రోజు వ్యవధిలో మళ్లీ పీసీబీ పరీక్షలు నిర్వహించి అతడికి పాజిటివ్‌గా తేల్చింది.

Samayam Telugu 27 Jun 2020, 10:41 am
పాకిస్థాన్ క్రికెటర్లు 10 మంది కరోనా వైరస్ బారిన పడినా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మెడికల్ స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ మండిపడ్డాడు. ఇంగ్లాండ్‌తో ఆగస్టు- సెప్టెంబరులో జరగనున్న మూడు టెస్టులు, మూడు టీ20లు సిరీస్‌ కోసం 29 మందితో కూడిన జట్టుని ప్రకటించిన పీసీబీ.. గత సోమవారం టీమ్‌కి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టుల్లో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని పీసీబీ ఆదేశించింది.
Samayam Telugu Pakistan Cricket Team


సెల్ఫ్ ఇసోలేషన్‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెటర్లకి పీసీబీ మెడికల్ స్టాఫ్ నుంచి సపోర్ట్ కరవైందని తాజాగా ఇంజిమామ్ ఉల్ హక్ ఆరోపించాడు. సలహాలు, సూచనల కోసం క్రికెటర్లు.. మెడికల్ స్టాఫ్‌కి ఫోన్ చేస్తుంటే కనీసం లిప్ట్ చేయడం లేదని తనకి తెలిసిందని చెప్పుకొచ్చిన హక్.. ఆ 10 మందిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచడం కంటే లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలిస్తే బాగుండేదని సూచించాడు.

Read More: పాక్ క్రికెట్‌లో ‘కరోనా’ తికమక.. హఫీజ్‌కి నెగటివ్ మళ్లీ పాజిటివ్
‘‘కరోనా పాజిటివ్‌‌గా తేలిన పాకిస్థాన్ క్రికెటర్లకి పీసీబీ మెడికల్ స్టాఫ్ ఏమాత్రం సహకరించడం లేదు. నాకు అందిన సమాచారం ప్రకారం.. గత రెండు రోజుల నుంచి కనీసం ఫోన్స్‌ని కూడా లిప్ట్ చేయడం లేదట. ఆటగాళ్ల పట్ల పీసీబీ ఇలా వ్యవహరించడం సరికాదు. మెడికల్ స్టాఫ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే మహ్మద్ హఫీజ్ పర్సనల్‌గా వెళ్లి ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్టు చేయించుకున్నాడు. 10 మంది ఆటగాళ్లని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచడం కంటే.. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంచడం మేలు. అక్కడ కావాల్సినన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడైతే ఆటగాళ్లు త్వరగా కోలుకుంటారు’’ అని ఇంజిమామ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.