యాప్నగరం

ఆసియా కప్‌లో భారత్‌ని ఢీకొనే పాక్ టీమ్ ఇదే

ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఎడమచేతి వాటం హిట్టర్ షాన్ మసూద్‌కి జట్టులో తొలిసారి చోటు దక్కింది.

Samayam Telugu 4 Sep 2018, 9:17 pm
యూఏఈ వేదికగా ఈనెల 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్ సెలక్టర్లు జట్టు‌ని మంగళవారం ప్రకటించారు. ఫిట్‌నెస్, ఫామ్‌కి పెద్దపీట వేసిన సెలక్టర్లు.. 16 మందితో కూడిన జట్టుని ఎంపిక చేశారు. దీంతో.. సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌పై వేటు తప్పలేదు. టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి.
Samayam Telugu 615750_thump-640x431


ఈనెల 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. 19న భారత్‌తో మ్యాచ్ ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడనుండటంతో.. సుదీర్ఘ చర్చ అనంతరం పాకిస్థాన్ సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఎడమచేతి వాటం హిట్టర్ షాన్ మసూద్‌కి జట్టులో తొలిసారి చోటు దక్కింది.

‘జట్టు ఎంపికకి ముందు ఆటగాళ్లకి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాం. ఆ టెస్టులో ఫెయిలవడంతో మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌‌ని పక్కన పెట్టాం. జట్టు ఫిట్‌నెస్ విషయంలో ఉదాసీనతకి తావులేదు’ అని చీఫ్ సెలక్టర్ ఇంజిమా ఉల్ హక్ స్పష్టం చేశాడు. మరోవైపు భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.