యాప్నగరం

Rahul Dravidని చూసి నేర్చుకోండి..! పాక్ దిగ్గజాలకి అఫ్రిది సూచన

భారత అండర్-19, భారత్-ఎ టీమ్‌కి సుదీర్ఘకాలం కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్.. ఎంతో మంది యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చాడు. ప్రస్తుతం టీమిండియాకి ఆడుతున్న రిషబ్ పంత్, గిల్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ అతని శిష్యులే.

Samayam Telugu 17 Jan 2021, 7:25 am
ప్రతిభావంతులైన యువ క్రికెటర్లని వెలుగులోకి తీసుకురావడం ఎలాగో..? టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ని చూసి పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు నేర్చుకోవాలని ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సూచించాడు. పాకిస్థాన్ టీమ్‌ మేనేజ్‌మెంట్, ఆటగాళ్ల మధ్య గత కొంతకాలంగా కమ్యూనికేషన్ గ్యాప్ తరచూ తెరపైకి వస్తుండగా.. ఇటీవల అదే కారణంతో 28 ఏళ్ల మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. తనని పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ టార్చర్ పెడుతోందని రిటైర్మెంట్ సమయంలో ఆ ఫాస్ట్ బౌలర్ చెప్పడం గమనార్హం.
Samayam Telugu Rahul Dravid (Image Source: Twitter)


అమీర్ టార్చర్ వ్యాఖ్యలపై అఫ్రిది మాట్లాడుతూ ‘‘ఇది మంచి సంప్రదాయం కాదు. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ మధ్య సామరస్య వాతావరణాన్ని బోర్డు కల్పించాలి. బోర్డు తన ప్లాన్‌ల గురించి ఆటగాళ్లకి స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ టీమ్ నుంచి క్రికెటర్‌ని తప్పించే సమయంలో అతనితో చీఫ్ కోచ్ మాట్లాడి మానసికంగా సిద్ధం చేయాలి. మాజీ క్రికెటర్లు మహ్మద్ యూసఫ్, ఇంజిమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్ తదితరులు కేవలం పాక్ జట్టుకి కోచ్‌గా ఉండేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. కానీ.. అలాకాకుండా వాళ్లు రాహుల్ ద్రవిడ్‌లా దేశంలోని జూనియర్ లెవల్ ఆటగాళ్లపై దృష్టి సారిస్తే అద్భుతాలు చేయవచ్చు’’ అని అఫ్రిది సూచించాడు.

భారత అండర్-19, భారత్-ఎ టీమ్ కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్.. ఎంతో మంది యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడుతున్న రిషబ్ పంత్, శుభమన్ గిల్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్, తదితరులు ద్రవిడ్ శిష్యులే కావడం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రాహుల్ ద్రవిడ్ హెడ్‌గా ఉన్నాడు. టీమిండియా కోచ్‌‌గా ఉండమని బీసీసీఐ ఆహ్వానించినా.. జూనియర్ క్రికెటర్లకి కోచింగ్ ఇచ్చేందుకే ద్రవిడ్ మొగ్గుచూపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.