యాప్నగరం

ఇదేం వింత..? పాక్, లంక రెండో వన్డే వాయిదా

శ్రీలంక క్రికెటర్లపై 2009లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత టెస్టులు ఆడుతున్న ఏ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. తాజాగా మళ్లీ శ్రీలంకనే పర్యటనకి వెళ్లగా.. వర్షంతో తొలి వన్డే రద్దయింది.

Samayam Telugu 28 Sep 2019, 7:12 pm

ప్రధానాంశాలు:

  • పాక్, శ్రీలంక మధ్య రెండో వన్డే ఒక్క రోజు వాయిదా
  • ఇప్పటికే వర్షంతో తొలి వన్డే రద్దు.. రెండో వన్డేపై అనుమానాలు
  • పదేళ్ల తర్వాత పాక్‌లో పర్యటిస్తున్న లంకేయులు
  • పాక్ టూర్‌కి దూరంగా శ్రీలంక అగ్రశ్రేణి క్రికెటర్లు మలింగ, మాథ్యూస్ తదితరులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pakistan v Sri Lanka
క్రికెట్‌లో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి తన చిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. శ్రీలంకతో కరాచీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రెండో వన్డే జరగాల్సి ఉండగా.. వర్షం వస్తుందనే సమాచారంతో ఆ మ్యాచ్‌ని సోమవారానికి వాయిదా వేసింది. వరల్డ్‌కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్ రిజర్వ్ డే గురించి మాత్రమే ఇప్పటి వరకూ విన్న క్రికెట్ అభిమానులు.. తాజాగా పాక్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సెటైర్లు పేల్చుతున్నారు.
Read More: undefined


2009 తర్వాత శ్రీలంక జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుండగా.. దాదాపు దశాబ్దం తర్వాత కరాచీ స్టేడియం వన్డేలకి ఆతిథ్యమిస్తోంది. అయితే.. శుక్రవారం పాక్, లంక మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో.. రెండో వన్డే సజావుగా జరుగుతుందనే నమ్మకం పాక్‌కి లేకపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖతో చర్చలు జరిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు, ఐసీసీతో మాట్లాడి మ్యాచ్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


షెడ్యూల్‌లో భాగంగా కరాచీ వేదికగా మూడు వన్డేలు, అనంతరం లాహోర్‌లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. పదేళ్ల ముందు శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా పాక్‌లో పర్యటించలేదు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.