యాప్నగరం

పాక్ బౌలర్ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు

పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు అందింది. అబుదాబి వేదికగా

TNN 19 Oct 2017, 9:00 pm
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు అందింది. అబుదాబి వేదికగా శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్.. ఐసీసీ నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో తాత్కాలికంగా అతని బౌలింగ్‌పై నిషేధం విధించిన ఐసీసీ.. 14 రోజుల్లోపు పరీక్షలకి హాజరై శైలిని నిరూపించుకోవాలని ఆదేశించింది.
Samayam Telugu pakistans mohammad hafeez reported for suspect bowling action
పాక్ బౌలర్ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు


హఫీజ్ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందడం ఇది మూడోసారి. 2014, డిసెంబరులో అనుమానాస్పద బౌలింగ్‌తో దాదాపు ఐదు నెలల ఈ బౌలర్‌పై ఐసీసీ నిషేధం విధించింది. తర్వాత.. 2015, జూన్‌లో మరోసారి ఇలాంటి ఫిర్యాదు అందడంతో 12 నెలల పాటు సస్పెన్షన్‌కి గురయ్యాడు. తాజా ఫిర్యాదుతో బ్రిస్బేన్‌లోని నేషనల్ క్రికెట్ సెంటర్‌లో పరీక్షలను హఫీజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హఫీజ్ 39 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.