యాప్నగరం

బీసీసీఐకి హెడ్‌గా మాజీ కాగ్ వినోద్ రాయ్

భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు బీసీసీఐకి కొత్త పాలకమండలిని నియమించింది.

TNN 30 Jan 2017, 5:08 pm
భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు బీసీసీఐకి కొత్త పాలకమండలిని నియమించింది. మన దేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పనిచేసిన రిటైరైన వినోద్ రాయ్‌ తో సహా చరిత్రకారుడు రామచంద్ర గుహ, మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జి, విక్రమ్ లిమాయేను ఆ పాలకమండలిలో సభ్యులుగా నిర్ణయించింది. ఆ పాలకమండలికి వినోద్ రాయ్ నాయకత్వం వహిస్తారని తెలిపింది. కేంద్రం బీసీసీఐ పాలకమండలిలో క్రీడల మంత్రిత్వ శాఖ సెక్రటరీలని బోర్డులో నియమించాలని కోర్టును కోరింది. సుప్రీం కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతేకాదు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే ఐసీసీ మీటింగ్ కు బీసీసీఐకు చెందిన అనిరుధ్ చౌదరి, అమితాబ్ చౌదరితో పాటూ విక్రమ్ లిమాయే కూడా హాజరవుతారని స్పష్టం చేసింది.
Samayam Telugu panel led by former cag vinod rai to run bcci said supreme court
బీసీసీఐకి హెడ్‌గా మాజీ కాగ్ వినోద్ రాయ్


లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయకునందుకు సుప్రీంకోర్టు బీసీసీఐపై గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది కూడా. కొత్త కమిటీని తానే స్వయంగా నియమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.