యాప్నగరం

బీసీసీఐని రచ్చకీడ్చే యత్నం.. పాక్ సెల్ఫ్ గోల్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెల్ఫ్ గోల్ చేసుకుంది. భారత్‌తో క్రికెట్ ఆడటం కుదరకపోవడంతో..

TNN 22 Oct 2017, 5:44 pm
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెల్ఫ్ గోల్ చేసుకుంది. భారత్‌తో క్రికెట్ ఆడటం కుదరకపోవడంతో.. బీసీసీఐకి షాకిచ్చేందుకు ప్రయత్నించిన పీసీబీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇరు బోర్డుల మధ్య గతంలో కుదిరిన ఒప్పందం మేరకు 2015 నుంచి 2023 మధ్య భారత్, పాక్‌లు ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లఘించిందనే కారణంతో 70 మిలియన్ డాలర్ల మేర పరిహారం కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ కమిటీని ఆశ్రయించింది. లీగల్ ఖర్చుల కోసం 10 లక్షల డాలర్లు రాబట్టేందుకు కూడా పీసీబీ బోర్డు కొద్ది నెలల క్రితం ఆమోదం తెలిపింది. పీసీబీ చీఫ్‌గా షహర్యార్ ఖాన్ ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగింది.
Samayam Telugu pcb left red faced over compensation claim from bcci
బీసీసీఐని రచ్చకీడ్చే యత్నం.. పాక్ సెల్ఫ్ గోల్!


కానీ షహర్యార్ ఖాన్ గత వారం లాహోర్లో మాట్లాడుతూ బీసీసీఐపై పీసీబీ వేసిన కేసు బలహీనమైందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడటం కుదురుతుందనే క్లాజ్ ఆ ఒప్పందంలో ఉందని ఆయన తెలిపారు. అందుకే బీసీసీఐ కూడా చాలా కాలంగా అదే మాట చెబుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకూ తాము పాక్‌తో క్రికెట్ ఆడలేమంటోంది. షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో రావడంతో పాక్ బోర్డు కంగుతింది.

పరిహారం విషయంలో వివరణ ఇస్తూ ప్రస్తుత పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ ట్వీట్ చేశారు. బోర్డు పెద్దల ఒత్తిడితో మాజీ చైర్మన్ కూడా కేసు బలహీనమనే వ్యాఖ్యలు తాను చేయలేదని మాట మార్చారు. కానీ షహర్యార్ ఖాన్ మాట్లాడిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఏం చెప్పాలో తెలియక పీసీబీ జుట్టు పీక్కుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.