యాప్నగరం

ఈ ఐపీఎల్ నాకొద్దు: పీటర్సన్

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ ఐపీఎల్ సీజన్‌‌కు టాటా చెప్పాడు.

TNN 7 Dec 2022, 4:13 pm
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ ఐపీఎల్ సీజన్‌‌కు టాటా చెప్పాడు. గతేడాది రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ హిట్టర్ ఐపీఎల్ 2017 సీజన్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసాడు. ఈ మేరకు ట్వీట్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. వింటర్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా బాగా అలసిపోయానని, రానున్న ఏప్రిల్, మే నెలలో విశ్రాంతి తీసుకుంటానని పేర్కొన్నాడు.
Samayam Telugu Pieterson


ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాస్ లీగ్ (బీబీఎల్)‌లో పీటర్సన్ మెల్‌బోర్న్ స్టార్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన కెవిన్ 268 పరుగులు చేసాడు. అంతకు ముందు క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్వహించిన ట్వంటీ20 టోర్నమెంట్‌లో డాల్ఫిన్స్ తరఫున బరిలోకి దిగాడు. అక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఈనెలలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున కెవిన్ ఆడే అవకాశం ఉంది.
FYI - I won't be going into the IPL auction. My winter has been too busy with all my travel & I don't want to spend April/May away too!— KP (@KP24) February 3, 2017
గడిచిన మూడు నెలల్లో చాలా బిజిబిజీగా గడిపిన కెవన్ ఇకపై ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని భావించినట్లున్నాడు. వాస్తవానికి గత ఐపీఎల్‌లో కెవిన్‌ను పుణే ప్రాంఛైజీ రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ పీటర్సన్ టోర్నీ మధ్యలోనే జట్టు నుంచి వైదొలిగాడు. పుణే కూడా పీటర్సన్ వదిలించుకోవడానికే మొగ్గు చూపింది. దీంతో ఈసారి వేలంలో కెవిన్ పాల్గొనాల్సి ఉంది. ఫిబ్రవరి 3లోగా వేలం కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఆటగాళ్ల వేలాన్ని కూడా ఈనెలలోనే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.