యాప్నగరం

రవి శాస్త్రికి స్పోర్టివ్ రిప్లై ఇచ్చిన మోడీ

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి, అందుకు కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ..

TNN 16 Mar 2017, 10:58 pm
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి, అందుకు కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు టీమిండియా మాజీ క్రికెట్ కెప్టేన్ రవిశాస్త్రి. సాధారణంగానే తన కామెంట్రీలో వన్ లైనర్స్‌తో ఆకట్టుకునే రవి శాస్త్రి.. ట్రేసర్‌బుల్లెట్ అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఈ ట్వీట్‌లో కూడా బీజేపి ఘన విజయాన్ని తనదైన స్టైల్లో ట్రేసర్‌బుల్లెట్‌తో అభివర్ణించారు.
Samayam Telugu pm narendra modi sportive reply to ravi shastri tweet
రవి శాస్త్రికి స్పోర్టివ్ రిప్లై ఇచ్చిన మోడీ

Congratulations @BJP4India on the landslide win in UP. The pair of PM @narendramodi & @AmitShah went past 300-mark like a #TracerBullet— Ravi Shastri (@RaviShastriOfc) March 16, 2017
అయితే, రవిశాస్త్రి చేసిన ఈ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంతే స్పోర్టివ్‌గా స్పందించారు. యూపీ పోల్స్ ఏమీ అంత పోటాపోటీగా జరగలేదన్నట్టుగా రిప్లై ట్వీట్ చేసిన మోడీ... అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచింది అంటూ తనదైన స్టైల్లో బదులిచ్చారు.
Thank you. UP polls did not quite go down to the wire. But, at the end of the day democracy is indeed the real winner! :) https://t.co/suoTqZtXit— Narendra Modi (@narendramodi) March 16, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.