యాప్నగరం

మైదానంలోకి మహిళా అంపైర్..!

మైదానంలోకి మహిళా అంపైర్లు రాబోతున్నారు. వారు కేవలం మహిళలు ఆడే క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం కాకుండా..

TNN 4 Oct 2017, 2:52 pm
మైదానంలోకి మహిళా అంపైర్లు రాబోతున్నారు. వారు కేవలం మహిళలు ఆడే క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం కాకుండా.. పురుషుల మ్యాచ్‌‌లకి కూడా అంపైరింగ్ చేయబోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకి చెందిన మహిళా అంపైర్ పొలోసాక్‌ ఓ పురుషుల మ్యాచ్‌కి అంపైరింగ్‌ చేసి అరుదైన ఘనతని అందుకుంది. 29 ఏళ్ల పొలోసాక్.. ఆస్ట్రేలియా ఎలెవన్, న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి అంపైర్‌గా పనిచేసింది. పురుషుల ఫస్ట్‌క్లాస్ స్థాయి మ్యాచ్‌ల్లో ఒక మహిళ అంపైర్‌గా పనిచేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
Samayam Telugu polosak set to create history as female umpire in australia
మైదానంలోకి మహిళా అంపైర్..!


‘నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ.. మ్యాచ్‌లు చూస్తుండేదాన్ని. ఈ ఆసక్తిని గమనించిన మా నాన్న నన్ను ఓ అంపైర్ కోర్సులో చేర్చారు. పురుషుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కి అంపైరింగ్ చేసే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాను. ఈ రంగంలో నేను మెరుగ్గా రాణించగలిగితే.. మరి కొంత మందికి మార్గదర్శకంగా ఉంటుంది’ అని పొలోసాక్ వివరించింది. అతి తక్కువ కాలంలోనే ఎలైట్ లెవల్ స్థాయికి పొలోసాక్ చేరుకోగలిగిందని.. ఇదే ప్రతిభని కొనసాగిస్తే పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లకి కూడా ఆమె అంపైరింగ్ చేయగలదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.