యాప్నగరం

పదేళ్ల కిందటే పృధ్వీషా‌కి సచిన్ శిక్షణ..!

ఇంగ్లాండ్‌తో త్వరలో జరగనున్న నాలుగు, ఐదో టెస్టు కోసం భారత సెలక్టర్లు బుధవారం ప్రకటించిన జట్టులో పృధ్వీషా చోటు సంపాదించి

Samayam Telugu 23 Aug 2018, 7:35 pm
ఇంగ్లాండ్‌తో త్వరలో జరగనున్న నాలుగు, ఐదో టెస్టు కోసం భారత సెలక్టర్లు బుధవారం ప్రకటించిన జట్టులో పృధ్వీషా చోటు సంపాదించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. 18 ఏళ్ల పృధ్వీషా‌ని జట్టులోకి ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. పదేళ్ల కిందటే ఈ కుర్రాడు తన ఆటతో దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌‌ని మెప్పించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెరీర్‌లో 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1,418 పరుగులు చేసిన పృధ్వీషా.. భారత్-ఎ తరఫున ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 406 పరుగులు చేయడం అతని నిలకడకి నిదర్శనం.
Samayam Telugu 1534960978-Prithvi_Shaw


భారత టెస్టు జట్టులోకి పృధ్వీషా ఎంపికవడంపై తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ‘దాదాపు పదేళ్ల కిందట.. నా స్నేహితుడు జగదీశ్ నా దగ్గరకి వచ్చి పృధ్వీషా గురించి చెప్తూ.. ఆ కుర్రాడి బ్యాటింగ్‌ మెరుగయ్యేందుకు సాయం చేయమని అడిగాడు. దీంతో.. నేను ఒక సెషన్‌ పృధ్వీషా‌తో ప్రాక్టీస్ చేయించి రెండు మూడు సూచనలు చేశాను. ఆ సమయంలో అతను బ్యాట్ పట్టుకునే విధానం, తీసుకున్న స్టాన్స్‌ను పరిశీలించి.. ఎట్టిపరిస్థితుల్లో ఇక స్టాన్స్ మార్చుకోవద్దని సూచించాను. అంతేకాదు సెషన్‌లో అతని ఆటను కాసేపు చూసిన తర్వాత.. ఈ కుర్రాడు తప్పకుండా భారత జట్టుకి ఆడతాడని నా స్నేహితుడితో అప్పుడే చెప్పా. ఆఖర్లో మరోసారి స్టాన్స్‌ మార్చుకోవద్దని పృధ్వీషాకి సూచించి.. ఎవరైనా బలవంతం చేస్తే నా పేరు చెప్పాల్సిందిగా సూచించాను’ అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.