యాప్నగరం

భారత్‌కి మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లే..!

తొలి టెస్టులోనే పృథ్వీ షా బ్యాక్‌ఫుట్‌పై చక్కగా ఆడటం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే.. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులు కొన్ని అతడి టెక్నిక్‌ని పరీక్షించాయి. - మంజ్రేకర్

Samayam Telugu 17 Oct 2018, 12:58 pm
భారత్ జట్టుకి ఓపెనర్ పృథ్వీ షా రూపంలో మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లేనని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో గత ఆదివారం ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 134, 70, 33 (నాటౌట్‌) పరుగులు చేసిన 18ఏళ్ల పృథ్వీ షా.. ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌’గా ఎంపికైన విషయం తెలిసిందే. అరంగేట్రం సిరీస్ అయినప్పటికీ అతను ఆడిన షాట్లు 22 ఏళ్ల క్రికెటర్‌ని తలపిస్తున్నాయని కొనియాడిన మంజ్రేకర్.. భారత జట్టుకి సెహ్వాగ్ తర్వాత మరో అటాకింగ్ ఓపెనర్‌ దొరికాడని వెల్లడించాడు.
Samayam Telugu 500


‘అరంగేట్రం టెస్టులోనే పృథ్వీ షా చాలా అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేశాడు. అతను ఓ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అని అతను పరుగులు సాధించిన వేగం (99 బంతుల్లోనే శతకం) బట్టే అర్థమవుతోంది. అలా అని.. ప్రతి బంతినీ బాదేయాలని అతను చూడట్లేదు. గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ.. పరుగులు రాబడుతున్నాడు. తొలి టెస్టులోనే పృథ్వీ షా బ్యాక్‌ఫుట్‌పై చక్కగా ఆడటం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే.. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులు కొన్ని అతడి టెక్నిక్‌ని పరీక్షించాయి. వాటితో పాటు షార్ట్ పిచ్‌ బంతుల్నీ కూడా ఆడటాన్ని అతను నేర్చుకుంటే భారత్‌కి మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లే. టెస్టుల్లో సెహ్వాగ్ దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్లని ఒత్తిడిలోకి నెట్టేవాడు. పృథ్వీ షా‌ కూడా ఆ స్థాయిలో ప్రభావం చూపగలడు’ అని మంజ్రేకర్ కొనియాడాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.