యాప్నగరం

చిచ్చు రేపుతున్న క్రికెటర్ శృంగార వీడియో!

శృంగార వీర.. జయసూర్య.. అంటూ క్రికెట్ ప్రంపంచం ఇప్పుడు కొత్త పాట అందుకుంది..

TNN 27 May 2017, 4:53 pm
శృంగార వీర.. జయసూర్య.. అంటూ క్రికెట్ ప్రంపంచం ఇప్పుడు కొత్త పాట అందుకుంది. శ్రీలంక మాజీ కెప్టెన్‌, క్రికెట్ దిగ్గజం సనత్‌ జయసూర్యకు చెందిన ఓ ప్రైవేట్‌ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే దీనికి కారణం. సనత్ తన మాజీ ప్రియురాలితో అత్యంత సన్నిహితంగా గడిపిన ఈ వీడియో ఇప్పుడు శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఒక యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తర్వాత ఆ పరిచయం కాస్త ముదిరి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ మానసికంగా, శారీరకంగా బాగా దగ్గరయ్యారు.
Samayam Telugu private tape sanath jayasuriya in an illegal act with his former girlfriend
చిచ్చు రేపుతున్న క్రికెటర్ శృంగార వీడియో!


అయితే.. కొన్ని విభేదాల కారణంగా వారిద్దరూ దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటోంది. ఆమె ఇప్పుడు శ్రీలంకలో ఓ ప్రముఖ మీడియా సంస్థకు ప్రాతినిధ్యం కూడా వహిస్తోంది. ప్రతీకారంతో.. జయసూర్యే స్వయంగా ఆ వీడియోను లీక్‌ చేశాడని ఆ మహిళ ఆరోపిస్తోంది.

‘ఆ వీడియో అతడే తీశాడు. గతంలో మేం ప్రేమికులుగా ఉన్నప్పుడు ఏకాంతంగా గడిపిన సమయంలో తీశాడు. ఇప్పుడు ప్రతీకారంతో దాన్ని బయటపెట్టాడు' అని సదరు మహిళ చెబుతోంది. అప్పటికే పెళ్లి చేసుకున్న జయసూర్య.. తన భార్యకు విడాకులిచ్చి ఆ యువతిని వివాహం చేసుకుంటానని మాటిచ్చాడట.

జయసూర్య.. తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అతడి సేవలకు గాను శ్రీలంక ప్రభుత్వం జయసూర్యకు అత్యంత ప్రతిష్టాత్మక ‘దేశబంధు’ అవార్డు ఇచ్చి సత్కరించింది. రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లో చేరిన జయసూర్య రాజపక్సే హయాంలో రూరల్ డెవలప్‌మెంట్ మంత్రిగానూ పని చేశాడు.

ఇలాంటి జయసూర్యలో ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి రావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. డాషింగ్ ఓపెనర్‌కు ఈ ఆటలోనూ ప్రవేశం ఉందా అంటూ విస్తూ పోతున్నారు. ఆ బ్యాటింగ్ వీరుడికి ఈ తొండాట తగదంటూ కొంత మంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు శ్రీలంకలోని రెండు ప్రముఖ కుటుంబాల్లో చిచ్చు రేపిన ఆ వీడియోను ఎవరు లీక్‌ చేశారో కనిపెట్టడానికి ఆ దేశ సైబర్‌ సెక్యూరిటీ కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.