యాప్నగరం

ఒంటరి పోరాటం చేస్తున్న పుజారా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది.

TNN 18 Mar 2017, 4:31 pm
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. మూడో రోజు టీమిండియా.. 99 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 303 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. అనంతరం ఆట మొదలవగానే.. కరుణ్‌ నాయర్‌ (23; 47 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. 107వ ఓవర్లో హేజిల్‌వుడ్‌ వేసిన 4వ బంతిని ఆడబోయి అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కరుణ్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ కూడా ఎంతోసేపు నిలవలేదు. అతడు కేవలం 3 (22 బంతుల్లో) పరుగులే చేసి కమిన్స్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా క్రీజులోకి వచ్చాడు. ఒకవైపు వికెట్లన్నీ పడిపోతున్నా.. ఛతేశ్వర్‌ పుజారా ఆసీస్‌ బౌలర్లను అడ్డుకొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నాడు.
Samayam Telugu pujaras one man show continues in ranchi
ఒంటరి పోరాటం చేస్తున్న పుజారా


ప్రస్తుతం భారత్.. 126 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఛతేశ్వర్‌ పుజారా 128 (320 బంతుల్లో, 17×4), వృద్ధిమాన్ సాహా 11 (26 బంతుల్లో, 2×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. పాల్ కమిన్స్ 4 వికెట్లు తీసి ఆసిస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఒకీఫే, హేజిల్‌వుడ్‌కు తలో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా స్కోర్‌ను సమం చేయడానికి భారత్.. మరో 104 పరుగులు చేయాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.