యాప్నగరం

కేఎల్ రాహుల్ క్రీజు వదిలితే ఎలా..? స్టంపౌట్

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా రాణించాడు. కానీ.. అతను ఔటైన తీరు ఇప్పుడు టీమిండియాలో కంగారు పెంచుతోంది. గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. రెండో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్.. మూడో టీ20లో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ ఆడబోయి కేఎల్ రాహుల్ వికెట్ చేజార్చుకున్నాడు.

Samayam Telugu 11 Jan 2020, 1:57 pm

Samayam Telugu pune t20 indian opener kl rahul becomes victim of the line ball stumping call
కేఎల్ రాహుల్ క్రీజు వదిలితే ఎలా..? స్టంపౌట్

రెండో టీ20లో క్రీజు వెలుపలికి వచ్చి క్లీన్‌బౌల్డ్

పుణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లిన కేఎల్ రాహుల్ బంతి అందకపోవడంతో స్టంపౌటయ్యాడు. అంతకముందు మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ హసరంగ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడబోయాడు. కానీ.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వెనక్కి వెళ్లి వికెట్లను గీరాటేసింది.

క్రీజుపై మాత్రమే పాదం ఉంచగలిగిన రాహుల్

వాస్తవానికి పుణె టీ20లో కేఎల్ రాహుల్ నాటౌట్ అని అంతా ఊహించారు. బంతి తన బ్యాట్‌కి అందకపోవడంతో వేగంగా పాదాన్ని క్రీజులో ఉంచేందుకు అతను ప్రయత్నించాడు. కానీ.. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా బెయిల్స్‌ని పడగొట్టే సమయానికి అతని పాదం క్రీజు లైన్‌పైనే ఉండిపోయింది. దీంతో.. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాట్స్‌మెన్ పాదం క్రీజు లైన్‌ లోపలికి కొద్దిగా అయినా రావాలి. లైన్‌పై ఉన్నా.. దాన్ని క్రీజులోకి వచ్చినట్లుగా పరిగణించరు.

రాహుల్, ధావన్ మధ్య పోటీ పతాక స్థాయికి

భారత్ జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పటికే పోటీ పతాక స్థాయికి చేరింది. రోహిత్ శర్మ‌తో కలిసి ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారు..? అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైపోయింది. దీంతో.. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ పోటాపోటీగా ఫామ్‌ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పుణె టీ20లో రాహుల్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా 52 పరుగులు చేసి ఫామ్‌ని నిరూపించుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.