యాప్నగరం

ఫైనల్లో మిడిలార్డర్‌పై భారత్ కంగారు..!

అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వెళ్లిన అంబటి రాయుడు, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు బాది ఔటవగా.. ఆ తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేసింది.

Samayam Telugu 28 Sep 2018, 4:02 pm
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో ఓటమి ఎరగకుండా టీమిండియా ఫైనల్‌కి చేరినా.. మిడిలార్డర్ బలహీతన మాత్రం జట్టుని వేధిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ‌లకి ఇటీవల ముగిసిన అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో రెస్ట్ ఇవ్వగా.. ఆ మ్యాచ్‌లో మరోసారి మిడిలార్డర్ డొల్లతనం బయటపడింది. దీంతో.. భారత్ జట్టు అతికష్టంమీద ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈరోజు బంగ్లాదేశ్‌తో టీమిండియా ఫైనల్లో తలపడనుండగా.. మిడిలార్డర్‌కి పరీక్ష ఎదురైతే పరిస్థితి ఏంటి..? అని జట్టులో కంగారు మొదలైంది.
Samayam Telugu question marks continue over indias middle order laxman sivaramakrishnan
ఫైనల్లో మిడిలార్డర్‌పై భారత్ కంగారు..!


భారత్ జట్టు మిడిలార్డర్‌పై మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివ రామకృష్ణ‌న్‌ మాట్లాడుతూ ‘భారత్ జట్టు ఫైనల్లో బలమైన జట్టుతో బరిలోకి దిగాలి. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐదు మంది అగ్రశ్రేణి ఆటగాళ్లకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. వారు ఈరోజు తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. భారత జట్టుని వేధిస్తున్న సమస్య మిడిలార్డర్. ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ వేగంగా ఔటైతే..? మిడిలార్డర్ రాణించడం చాలా కీలకం. అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వెళ్లిన అంబటి రాయుడు, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు బాది ఔటవగా.. ఆ తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేసింది. కాబట్టి.. ఈ బలహీనతని భారత్ ఫైనల్లోనైనా సరిదిద్దుకోవాలి’ అని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.