యాప్నగరం

ఐపీఎల్: గాయంతో దిల్లీ డేర్‌డెవిల్స్ హిట్టర్ ఔట్

హిట్టర్ చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు రెండు నెలల సమయం పడుతుందని

TNN 24 Mar 2017, 3:21 pm
ఐపీఎల్ పదో సీజన్ ఆరంభానికి ముందే దిల్లీ డేర్‌డెవిల్స్‌‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత వారం ఆ జట్టు ఆల్‌రౌండర్ జేపీ డుమిని వ్యక్తిగత కారణాల వల్ల 2017 సీజన్‌కి అందుబాటులో ఉండనని ప్రకటించగా.. గాయంతో తను కూడా టోర్నీకి దూరమవుతున్నట్లు హిట్టర్ డికాక్ తాజాగా వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో డికాక్ చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకునేందుకు రెండు నెలల సమయం పడుతుందని సమాచారం.
Samayam Telugu quinton de kock ruled out of ipl 10 due to finger injury
ఐపీఎల్: గాయంతో దిల్లీ డేర్‌డెవిల్స్ హిట్టర్ ఔట్

దిల్లీ జట్టుకి దూరమైన ఇద్దరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికా క్రికెటర్లే కావడం విశేషం.

2014లో డికాక్‌ని రూ. 3.5 కోట్లకి దిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. గత ఏడాది ముగిసిన ఐపీఎల్-9లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్.. మెరుపు హిట్టింగ్‌తో దిల్లీకి భారీ స్కోర్లు అందించాడు. ప్రస్తుతం అతడు దూరమవడంతో దిల్లీ జట్టు ఓపెనర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ని కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాణ్యమైన బ్యాట్స్‌మెన్ల సేవల కోల్పోయిన దిల్లీ జట్టు సీజన్‌నిఎలా నెట్టుకొస్తుందో ..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.