యాప్నగరం

బాబోయ్.. టీ20ల్లో ధోనీతో చాలా కష్టం: అశ్విన్

2016 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో చివరి 6 బంతుల్లో 23 పరుగులు చేసిన అశ్విన్.. మ్యాచ్‌ని గెలుపుగా ముగించాడు. అప్పుడు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో అశ్విన్ ఉన్నాడు.

Samayam Telugu 28 Apr 2020, 8:06 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రస్తుతం ఇంటి వద్దే సమయం గడుపుతున్న అశ్విన్.. అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని.. ‘‘టీ20ల్లో ఎవరికి బౌలింగ్ చేయాలంటే కష్టం..?’’ అని అడగగా.. ‘ధోనీ’ అని అశ్విన్ ఆన్సర్ దేశాడు. దాంతో.. ‘‘ధోనీ గురించి కాస్త చెప్పండి’’ అని ఆ వెంటనే మరో ప్రశ్న సంధించాడు.
Samayam Telugu MS Dhoni, Aswhin


Read More: ధోనీ స్థానంలో కీపింగ్ అంత ఈజీ కాదు: కేఎల్ రాహుల్

‘‘టీ20 గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో మహేంద్రసింగ్ ధోనీ కూడా ఒకడు. ఆ ఫార్మాట్‌లో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో ధోనీని నిలువరించడం గగనమే. ఇక ధోనీ గురించి అంటారా..? భారత్ ఇప్పటి వరకూ చూడని గొప్ప కెప్టెన్‌ ధోని. అలానే ఐపీఎల్‌లోనూ అదే స్థాయిని అతను అందుకున్నాడు’’ అని అశ్విన్ వెల్లడించాడు. భారత్‌కి 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలానే ఐపీఎల్‌లోనూ చెన్నై టీమ్‌కి కెప్టెన్‌గా ధోనీ మూడు టైటిల్స్‌ని అందించాడు.

Read More: undefined

మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో సుదీర్ఘకాలం టీమిండియా తరఫున ఆడిన అశ్విన్.. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం అశ్విన్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.