యాప్నగరం

ఐపీఎల్‌కి అశ్విన్ దూరం.. కారణం..?

ఈ సుదీర్ఘ టెస్టు సిరీస్‌ల మధ్యలోనే అశ్విన్‌కి విశ్రాంతి ఇచ్చేందుకు సెలక్టర్లు ప్రయత్నించినా.. అతడిపై ఎక్కువగానే భారం పడినట్లు కనిపిస్తోంది.

TNN 31 Mar 2017, 5:49 pm
ఐపీఎల్ పదో సీజన్ సమీపిస్తున్న కొద్దీ.. టోర్నీకి దూరమవుతున్న ఆటగాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. గత ఏడాది జులై నుంచి భారత్‌లో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లు ఆడిన అశ్విన్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో మొత్తం 13 టెస్టులాడిన అశ్విన్ రికార్డు స్థాయిలో 82 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతను 738.2 ఓవర్లు బౌలింగ్‌ చేయడం విశేషం.
Samayam Telugu r ashwin set to miss ipl 2017
ఐపీఎల్‌కి అశ్విన్ దూరం.. కారణం..?


ఈ సుదీర్ఘ టెస్టు సిరీస్‌ల మధ్యలోనే అశ్విన్‌కి విశ్రాంతి ఇచ్చేందుకు సెలక్టర్లు ప్రయత్నించినా.. అతడిపై ఎక్కువగానే భారం పడినట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఇటీవల ధర్మశాలలో ముగిసిన టెస్టు మ్యాచ్ అనంతరం అశ్విన్ పొత్తి కడుపునొప్పితో బాధపడ్డాడట. ప్రస్తుతం ఈ నొప్పికి చికిత్స తీసుకుంటున్న అశ్విన్.. కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ దూరమవడంతో ఆందోళనలో ఉన్న రైజింగ్ పుణె జట్టు.. ఇప్పుడు అశ్విన్ నిర్ణయంతో షాక్‌కి గురైంది. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ పదో సీజన్ ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.