యాప్నగరం

రహానేకు గాయం, మనీశ్ పాండేకు అవకాశం

ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు కర్ణాటక బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే ఎంపికయ్యాడు.

TNN 7 Dec 2016, 5:45 pm
ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు కర్ణాటక బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే ఎంపికయ్యాడు. ఆజింక్య రహానేకు గాయం కావడంతో అతని స్థానంలో పాండే బరిలోకి దిగనున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య డిసెంబర్ 8 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాలుగో టెస్టు ప్రారంభమవుతుంది.
Samayam Telugu rahane out of test series manish pandey called up
రహానేకు గాయం, మనీశ్ పాండేకు అవకాశం


కాగా, బుధవారం వాంఖడే స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రహానే చేతిని బంతి బలంగా తాకింది. దీంతో అతని కుడిచేతి చూపుడు వేలికి గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. రహానే చేతి వేలికి గాయమైందని, ఇంగ్లండ్‌తో జరగనున్న తరవాత రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది.

కాగా, ఈ సిరీస్‌లో రహానే ఆశించిన మేరకు రాణించలేదు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ ఆడిన రహానే టాప్ స్కోరు 26. మరోవైపు బౌలర్ మహ్మద్ షమీ కూడా గాయంతో బాధపడుతుండటం భారత్‌ను కలవరపెడుతోంది. షమీ నాలుగో టెస్టులో ఆడటం ఇంకా అనుమానంగానే ఉంది. ఎందకన్నా మంచిదని ముంబై పేసర్ షార్దుల్ ఠాకూర్‌ను సిద్ధం చేసింది.

నాలుగో టెస్టుకు భారత జట్టు: మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), పార్థివ్ పటేల్, కరుణ్ నాయర్, మనీశ్ పాండే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, షార్దుల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.