యాప్నగరం

శతకంతో మెరిసిన ద్రవిడ్ కుమారుడు

భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు శతకంతో చెలరేగాడు. కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న

TNN 10 Jan 2018, 5:40 pm
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు శతకంతో చెలరేగాడు. కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సమిత్ ద్రవిడ్ 150 పరుగులతో తాను ప్రాతినిథ్యం వహించిన మాల్య అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌కి భారీ స్కోరు అందించాడు. వివేకానంద స్కూల్‌తో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అదితి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసింది. సమిత్‌తో పాటు కర్ణాటక క్రికెటర్ సుశీల్ జోషి కుమారుడు ఆర్యన్ (146) కూడా శతకం బాదాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 138 పరుగులకే వివేకానంద స్కూల్ కుప్పకూలిపోయింది.
Samayam Telugu rahul dravid sunil joshis sons score hundreds
శతకంతో మెరిసిన ద్రవిడ్ కుమారుడు


2016, ఏప్రిల్‌లో బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కి ప్రాతినిధ్యం వహించిన సమిత్ ద్రవిడ్ సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2015, సెప్టెంబరులో జరిగిన అండర్-12 గోపాలన్ క్రికెట్ ఛాలెంజ్ టోర్నమెంట్‌లోనూ వరుసగా 77 నాటౌట్, 93, 77 పరుగులు చేసి టోర్నీ‌ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా సమిత్ ఎంపికయ్యాడు. సమిత్‌కి కళ్లు, చేతులకి మధ్య సమన్వయం చాలా బాగుంటుంని.. బంతి గమనాన్ని వేగంగా అంచనా వేసి స్మాష్ చేస్తాడంటూ అప్పట్లో ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.