యాప్నగరం

టీమిండియాతో విదేశాలకి ద్రవిడ్ నో..!

భారత్ జట్టుతో కలిసి విదేశాల్లో పర్యటించేందుకు అతను సిద్ధంగా లేడు

Samayam Telugu 22 Jul 2017, 6:55 pm
భారత్ జట్టుతో కలిసి విదేశీ పర్యటనలకి వెళ్లేందుకు మాజీ కెప్టెన్, జట్టు బ్యాటింగ్ సలహాదారుడిగా ఇటీవల ఎంపికైన రాహుల్ ద్రవిడ్ నిరాకరించాడట. ఇప్పటికే భారత్-ఎ, అండర్-19 జట్లకి కోచ్‌గా పనిచేస్తున్న ద్రవిడ్.. విదేశీ పర్యటనల కోసం సమయం కేటాయించలేనని చెప్పినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ శనివారం వెల్లడించారు. ప్రధాన కోచ్‌గా ఇటీవల నియమితుడైన రవిశాస్త్రి తన సహాయకులుగా భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), సంజయ్ బంగర్ (అసిస్టెంట్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్‌ కోచ్)‌లను ఎంచుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ సలహాదారుడిగా జహీర్ ఖాన్ జట్టు కోసం పనిచేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కానీ.. జహీర్ ఖాన్ ఏడాదికి 150 రోజులు మాత్రమే జట్టుతో కలిసి పనిచేస్తాడని సమాచారం.
Samayam Telugu rahul dravid wont tour with senior team
టీమిండియాతో విదేశాలకి ద్రవిడ్ నో..!


‘రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్‌ని క్రమబద్ధీకరించాం. అతను ఇప్పటికే పూర్తి స్థాయిలో భారత్-ఎ, అండర్-19 జట్టుకి కోచ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో టీమిండియాకి విదేశీ పర్యటనల కోసం అందుబాటులో ఉండలేనని మాతో చెప్పాడు. భారత్ జట్టుతో కలిసి విదేశాల్లో పర్యటించేందుకు అతను సిద్ధంగా లేడు’ అని వినోద్ రాయ్ స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న జహీర్ ఖాన్ కాంట్రాక్ట్ విషయమై ఇంకా చర్చ నడుస్తోందని.. తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.