యాప్నగరం

IPL 2020 నుంచి గాయంతో స్టార్ క్రికెటర్ ఔట్

ఐపీఎల్ 2019 సీజన్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో పోటీపడుతూ డెత్ ఓవర్లలో జోప్రా ఆర్చర్ బౌలింగ్ చేశాడు. అతని జోరుతో రాజస్థాన్ రాయల్స్‌ బౌలింగ్ విభాగం తిరుగులేని స్థాయిలో కనిపించింది. కానీ.. ఈ ఏడాది ఐపీఎల్‌కి జోప్రా దూరమవుతున్నాడు.

Samayam Telugu 6 Feb 2020, 4:28 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఆ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ గాయం కారణంగా.. దాదాపు మూడు నెలలు క్రికెట్‌కి దూరమయ్యాడు. వెస్టిండీస్‌లో పుట్టి.. గత ఏడాది ఇంగ్లాండ్ తరఫున వన్డే ప్రపంచకప్ ఆడిన జోప్రా ఆర్చర్.. ఆ జట్టు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌కి రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ అతనిపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ.. మోచేతి గాయం కారణంగా అతను జూన్ వరకూ క్రికెట్ ఆడే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు.
Samayam Telugu IPL 2020, Rajasthan Royals, Jofra Archer


ఇంగ్లాండ్ టీమ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. అక్కడ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడిన జోప్రా ఆర్చర్ ఆ తర్వాత గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు. తాజాగా అతను సఫారీ టూర్‌కే కాకుండా.. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా దూరంగా ఉండబోతున్నాడని తేలిపోయింది. ఈ మేరకు ఇప్పటికే ఇంగ్లాండ్‌కి చేరుకున్న ఆర్చర్.. మోచేతి గాయానికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున జోప్రా ఆర్చర్ నిలకడగా రాణించాడు. టోర్నీలో 11 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. డెత్ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఎంతలా అంటే..? గత ఏడాది ఐపీఎల్‌లో అతని బౌలింగ్ ఎకానమీ ఓవర్‌కి 6.76గా ఉంది. దీంతో అతను ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరమవడం.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.