యాప్నగరం

నేటివిటీ టచ్... రాజస్థాన్ రాయల్స్ పాట అదుర్స్

ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ యాజమాన్యం దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే పబ్లిసిటీని మొదలు పెట్టేసింది. ఏకంగా అఫిషియల్ ఏంథమ్‌ను రిలీజ్ చేసింది. నెటివిటీ టచ్‌తో పాటను చాలా చక్కగా రూపొందించారు.

Samayam Telugu 18 Mar 2018, 4:21 pm
ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ యాజమాన్యం దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే పబ్లిసిటీని మొదలు పెట్టేసింది. ఏకంగా అఫిషియల్ ఏంథమ్‌ను రిలీజ్ చేసింది. నెటివిటీ టచ్‌తో పాటను చాలా చక్కగా రూపొందించారు. టీమ్ జెర్సీ కలర్‌ను జోడించి గ్రామీణ వాతావరణం కనిపించేలా పాటను షూట్ చేశారు. కొంతమంది చిన్నారులు, మహిళలతో షూట్ మొత్తం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజస్థాన్ గ్రామాల అందం... అక్కడి సంస్కృతిని ప్రతిబింబిచేలా సాగింది. జానపద గాయకురాలు ఇలా అరుణ్ పాటను పాడారు. ఫిర్ హల్లా బోల్ అంటూ పాట ప్రారంభమై... మళ్లీ అలాగే ముగుస్తుంది.
Samayam Telugu rajasthan royals official team anthem 2018 phir halla bol
నేటివిటీ టచ్... రాజస్థాన్ రాయల్స్ పాట అదుర్స్


ఈ సాంగ్‌ను రాజస్థాన్ అఫిషియల్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. అలాగే యూ ట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఏంథమ్ అభిమానులను తిరిగి దగ్గర చేస్తుందని ఆశిస్తున్నామని రాయల్స్ పార్టనర్ మనోజ్ బదాలే అన్నారు. అందుకే నెటివిటీ టచ్‌తో పాటను షూట్ చేశామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.