యాప్నగరం

​రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ప్రకటన టీవీలో..!

రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌ని నియమించే

TNN 24 Feb 2018, 3:07 pm
రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌ని నియమించే పనిలో పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2018 వేలంలో అత్యధిక ధర రూ. 12.5 కోట్లకి బెన్‌స్టోక్స్, రూ.11.50 కోట్లకి జయదేవ్ ఉనద్కత్‌‌ని కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్.. తాజాగా కెప్టెన్‌ నియామక ప్రకటనని కూడా కొత్తగా చేయనున్నట్లు వెల్లడించింది. శనివారం సాయంత్రం స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌ ద్వారా తమ జట్టుకి కొత్త కెప్టెన్‌ ఎవరనే విషయాన్ని ప్రకటించనున్నట్లు రాజస్థాన్ తెలిపింది. పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా టీవీలో ఓ జట్టు కెప్టెన్‌ని ప్రకటించడం ఇదే తొలిసారి.
Samayam Telugu rajasthan royals to announce skipper on television ipl 2018
​రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ప్రకటన టీవీలో..!


రాజస్థాన్ కెప్టెన్సీ వేట.. ఇప్పుడు నలుగురు క్రికెటర్ల చుట్టూనే తిరుగుతోంది. అట్టిపెట్టుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ (రూ. 12.5 కోట్లు), వేలంలో కొనుగోలు చేసిన బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ (రూ. 4.4 కోట్లు), అజింక్య రహానె (రూ. 4కోట్లు) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ‘వివిధ దేశాల నుంచి జట్టులోకి వచ్చిన క్రికెటర్లని సమన్వయం చేయడంలో కెప్టెన్‌‌ది కీలకపాత్ర. బెన్‌స్టోక్స్, రహానె, స్టీవ్‌స్మిత్ రూపంలో మాకు మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. అయితే.. జోస్‌ బట్లర్‌‌కి కూడా జట్టుని నడిపించే సామర్థ్యం ఉంది’ అని ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌కి మెంటార్‌గా నియమితుడైన షేన్‌వార్న్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.