యాప్నగరం

బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో భారత్ టార్గెట్ 154

తొలి టీ20లో బంగ్లాదేశ్‌కి 149 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా.. మూడు బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు ఛేదించింది. ఈరోజు రెండో టీ20లో భారత్‌కి 154 పరుగుల టార్గెట్‌ని బంగ్లాదేశ్ నిర్దేశించింది. మరి భారత్ ఛేదిస్తుందా..?

Samayam Telugu 7 Nov 2019, 9:15 pm
టీమిండియాకి రెండో టీ20లో బంగ్లాదేశ్ గట్టి సవాల్ విసిరింది. రాజ్‌కోట్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (36: 31 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Samayam Telugu rajkot t20 bangladesh set a target of 154 runs for india
బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో భారత్ టార్గెట్ 154


undefined
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిట్టన్ దాస్ (29: 21 బంతుల్లో 4x4), నయిమ్ తొలి వికెట్‌కి 7.2 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ దాస్ రనౌటవగా.. నయిమ్‌ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్ (30: 20 బంతుల్లో 2x4, 1x6), మహ్మదుల్లా (30: 21 బంతుల్లో 4x4) మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. కానీ.. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్‌ని గెలిపించిన ముష్ఫికర్ (4: 6 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్; వాసింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

Read More: కీపర్‌గా పంత్ అవమానకర స్టంపింగ్.. నోబాల్

మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఓ స్టంపింగ్ తప్పిదానికి పాల్పడగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సులువైన క్యాచ్‌ని జారవిడిచాడు. ఇక తొలి టీ20లో తాను వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకి నాలుగు ఫోర్లు సమర్పించుకున్న ఖలీల్ అహ్మద్.. రెండో టీ20లో తాను వేసిన తొలి ఓవర్ మొదటి మూడు బంతులకీ మూడు ఫోర్లు ఇచ్చేశాడు. దీంతో.. టీ20ల్లో వరుసగా ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు.

Read More: బంగ్లాపై రాజ్‌కోట్ టీ20తో రోహిత్ శర్మ @100

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.