యాప్నగరం

రంజీ ఫైనల్లో విదర్భ బౌలర్ సంచలనం

అద్భుత ఆటతీరుతో విదర్భ జట్టు తొలిసారి రంజీ ఫైనల్ చేరగా, 24 ఏళ్ల గుర్బానీ హ్యాట్రిక్‌తో సత్తా చాటాడు.

TNN 30 Dec 2017, 1:11 pm
ఇండోర్: రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ పేసర్ రజ్‌నీష్ గుర్బానీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఢిల్లీతో జరుగుతోన్న ఫైనల్లో హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనత వహించాడు. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్లో హ్యాట్రిక్ సాధించింది గుర్బానీనే కావడం విశేషం. ఓ దశలో ఢిల్లీ ఆరు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కానీ విదర్భ పేసర్ వరుస బంతుల్లో చివరి మూడు వికెట్లను కూల్చడంతో ఢిల్లీ జట్టు 295 పరుగులకే కుప్పకూలింది.
Samayam Telugu rajneesh gurbani second bowler to take hat trick in ranji trophy final
రంజీ ఫైనల్లో విదర్భ బౌలర్ సంచలనం


ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రజ్‌నీష్ 59 పరుగులిచ్చి 6 వికెట్లు కూల్చాడు. పటిష్టమైన కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లోనూ ఈ విదర్భ పేసర్ సత్తా చాటాడు. 162 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో విదర్భ తొలిసారిగా రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది.

WATCH Rajneesh Gurbani's hat-trick that sent Delhi packing in the first innings. He became only the second bowler in the history of the #RanjiTrophy #Final to take a hat-trick @paytm #DELvVID : https://t.co/W1yolPHqUC — BCCI Domestic (@BCCIdomestic) December 30, 2017
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగా.. అందులో ధృవ్ షోరే చేసివనే 145 రన్స్ గమనార్హం. సంచలన ప్రదర్శనతో రంజీ ఫైనల్ చేరిన విదర్భ బ్యాట్‌‌తోనూ దీటుగా బదులిస్తోంది. 22.2 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. కెప్టెన్ ఫయిజ్ ఫజల్ 51 పరుగులతో, సంజయ్ రామస్వామి 22 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.