యాప్నగరం

మిథాలీతో గొడవ.. కోచ్ పదవికి ఎసరు..?

కోచ్ పొవార్‌ తనపై వివక్ష చూపినట్లు మిథాలీరాజ్ తీవ్ర స్థాయిలో ఆరోపించగా.. పొవార్‌ కూడా ఆమెకి జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యమంటూ బదులిచ్చాడు.

Samayam Telugu 30 Nov 2018, 5:48 pm
భారత మహిళల జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో విభేదాల కారణంగా కోచ్ రమేశ్ పొవార్ మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల అతడికి తాత్కాలికంగా కోచ్ బాధ్యతల్ని అప్పగించగా.. ఈరోజుతో ఆ పదవీకాలం ముగియనుంది. అయితే.. మళ్లీ కోచ్ కోసం పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. బీసీసీఐ మాత్రం అతని తీరుతో గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu 88


వెస్టిండీస్ వేదికగా గతవారం టీ20 ప్రపంచకప్ ముగియగా.. ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌‌కి మిథాలీ రాజ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. స్పందించిన బీసీసీఐ కోచ్ పొవార్‌తో పాటు టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ నుంచి వివరణ తీసుకుంది. ఈ క్రమంలో.. పొవార్‌ తనపై వివక్ష చూపినట్లు మిథాలీరాజ్ తీవ్ర స్థాయిలో ఆరోపించగా.. పొవార్‌ కూడా ఆమెకి జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యమంటూ బదులిచ్చాడు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు కారణంగా.. భారత మహిళల జట్టు‌ స్థాయిని దిగజార్చారని భావిస్తోన్న బీసీసీఐ.. పొవార్‌ తీరుపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. మళ్లీ కోచ్ పదవికి అతను దరఖాస్తు చేసుకున్నా.. తిరస్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.