యాప్నగరం

Rashid Khan: ధోనీ భాయ్ హెలికాఫ్టర్‌ షాట్ ఆడా.. రషీద్ ఖాన్ సంబరం

అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ టీ10 లీగ్‌లో బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. ధోనీలా హెలికాఫ్టర్ షాట్ ఆడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Samayam Telugu 30 Nov 2018, 3:02 pm
రషీద్ ఖాన్.. క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ అప్ఘాన్ స్పిన్నర్ పేరు సుపరిచితం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగుతున్న ఈ మ్యాజిక్ స్పిన్నర్.. బ్యాట్‌‌తోనూ సత్తా చాటుతూ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. ఇటీవల టీ10 లీగ్ మ్యాచ్ సందర్భంగా రషీద్ హెలికాఫ్టర్ షాట్‌తో భారీ సిక్స్ బాది అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరాఠా అరేబియన్స్ తరఫున బరిలో దిగిన రషీద్.. పఖ్తూన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అచ్చం ధోనీలా ఈ షాట్ ఆడాడు.
Samayam Telugu dhoni rashid


7 అడుగుల 1 అంగుళం పొడవు ఉన్న మహ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో రషీద్ ఈ షాట్ ఆడగా.. బంతి షార్జా స్టేడియం పై కప్పును తాకింది. హెలికాఫ్టర్ షాట్‌ను కనిపెట్టిన ధోనీ భాయ్‌లా నేను కూడా ఆ షాట్ ఆడానోచ్.. అంటూ రషీద్ ఖాన్ ఆ వీడియోను ట్వీట్ చేశాడు.
ugu

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.