యాప్నగరం

చరిత్ర సృష్టించిన ఆప్ఘాన్ స్పిన్నర్ రషీద్

అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఇటీవలే ఐసీసీ వన్డే బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రషీద్.. టీ20 బౌలర్ల జాబితాలోనూ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు.

TNN 25 Feb 2018, 8:11 pm
అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఇటీవలే ఐసీసీ వన్డే బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రషీద్.. టీ20 బౌలర్ల జాబితాలోనూ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. షార్జా వేదిక జింబ్వాబేతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఈ ఆప్ఘాన్ స్పిన్నర్ 19 ఏళ్లకే అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారమే వన్డేల్లో నెంబర్ 1 బౌలర్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా రషీద్ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.
Samayam Telugu rashid khan tops t20i rankings for bowlers
చరిత్ర సృష్టించిన ఆప్ఘాన్ స్పిన్నర్ రషీద్


రషీద్ 759 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కివీస్ బౌలర్ ఇష్ సోధి 700 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ విభాగం విషయానికి వస్తే.. కివీస్ హిట్టర్ కొలిన్ మున్రో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యతాస్యం కేవలం 2 పాయింట్లు మాత్రమే కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.