యాప్నగరం

క్రికెటర్ల జీతాల పెంపుపై రవిశాస్త్రి ఫైర్..!

ఓ రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడి తర్వాత విదేశాల్లో జల్సా చేయొచ్చని అతను అనుకోవచ్చు. కానీ.. మిగతా దేశాల క్రికెటర్లతో పోలిస్తే

TNN 3 Apr 2017, 8:04 pm
టీమిండియా క్రికెటర్ల జీతాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత నెలలో అనూహ్యంగా రెట్టింపు చేసింది. ఎ-గ్రేడ్ క్రికెటర్లకి రూ. కోటి స్థానంలో రూ. రెండు కోట్లు.. అలానే బి-గ్రేడ్‌కి రూ.కోటి.. సి-గ్రేడ్‌కి రూ. 50లక్షలకి పెంచింది. కానీ.. ఈ జీతాల పెంపుపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా దేశాల క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా క్రికెటర్లు ఇప్పటికీ తక్కువ జీతాలనే అందుకుంటున్నారని దుయ్యబట్టారు. వన్డే, టీ20లతో పాటు ఎలాంటి లీగ్‌లు ఆడకుండా కేవలం టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్న పుజారా లాంటి క్రికెటర్లకి ఇవి ఎలా సరిపోతాయని రవిశాస్త్రి ప్రశ్నించారు.
Samayam Telugu ravi shastri bats for steep pay hike for international cricketers
క్రికెటర్ల జీతాల పెంపుపై రవిశాస్త్రి ఫైర్..!


‘భారత్‌లో ఎ- గ్రేడ్ క్రికెటర్లు అత్యధికంగా కాంట్రాక్ట్ రూపంలో అందుకుంటున్నారు. పుజారా లాంటి వారు ఆ గ్రేడ్‌లో ఉండటంతో అతనికి పెద్ద మొత్తంలోనే అందుతుంది. కాబట్టి అతను ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడలేకపోయానని బాధపడాల్సిన పనిలేదు. ఓ రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడి తర్వాత విదేశాల్లో జల్సా చేయొచ్చని అతను అనుకోవచ్చు. కానీ.. మిగతా దేశాల క్రికెటర్లతో పోలిస్తే ఆ రూ.2 కోట్లు మాత్రం చాలా తక్కువ’ అని రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బోర్డులు భారత్‌ కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు ఈ మాజీ క్రికెటర్ పరోక్షంగా ప్రస్తావించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.