యాప్నగరం

అవును.. రవిశాస్త్రి రేసులోకి వచ్చాడు..!

కోచ్ అనిల్ కుంబ్లే రేసులో ఉండటంతో ఎవరూ పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ మాత్రమే

TNN 3 Jul 2017, 7:18 pm
భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల దరఖాస్తుకి గడువు పెంచిన నేపథ్యంలో.. తను మాత్రం అప్లై చేసి క్యూలో నిల్చోనని రవిశాస్త్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సూచనతో రవిశాస్త్రి పునరాలోచన‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ వాటిని ధ్రువీకరించింది. దరఖాస్తు చేసుకునేందుకు గడువు జులై 9 వరకు ఉన్నా.. ఇప్పటికే రవిశాస్త్రి, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ సిమన్స్ అప్లై చేసినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Samayam Telugu ravi shastri formally applies for team india coach job
అవును.. రవిశాస్త్రి రేసులోకి వచ్చాడు..!


ప్రధాన కోచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ తొలుత గడువుని మే 30 వరకే ప్రకటించింది. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే రేసులో ఉండటంతో ఎవరూ పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ మాత్రమే అనిల్ కుంబ్లేతో పోటీపడేందుకు సిద్ధమయ్యారు. కానీ.. అనూహ్యంగా కోహ్లితో విభేదాల కారణంగా తాను కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కుంబ్లే లేఖలో బహిర్గతం చేసి పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో పునరాలోచనలో పడిన బీసీసీఐ తాజా గడువును పెంచి.. మరిన్ని దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.