యాప్నగరం

అశ్విన్ తీసింది ఒక్క వికెట్.. కానీ రికార్డ్ బ్రేక్

ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ (78 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును

TNN 25 Mar 2017, 6:22 pm
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీసింది ఒక వికెట్ మాత్రమే. కానీ.. ఆ వికెట్‌తోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ (78 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అశ్విన్ తాజాగా తిరగరాశాడు. ధర్మశాల టెస్టుకి ముందు 78 వికెట్లతో స్టెయిన్‌ని సమం చేసిన అశ్విన్.. శనివారం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వికెట్ పడగొట్టి ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Samayam Telugu ravichandran ashwin breaks dale steyns record
అశ్విన్ తీసింది ఒక్క వికెట్.. కానీ రికార్డ్ బ్రేక్


గత ఏడాది న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 27 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 28 వికెట్లతో రాణించాడు. తాజా సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో కూడా అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ తరఫున వేగంగా అత్యధిక వికెట్లు పడగొడుతున్న బౌలర్‌గా రికార్డులను తిరగరాస్తున్న అశ్విన్.. తాజా సిరీస్‌లో కూడా ఇప్పటికే 18 వికెట్లు పడగొట్టేయడం విశేషం. ఒకవైపు బంతితో చెలరేగుతూనే.. భారత్ జట్టుకి ఆల్‌రౌండర్ కొరతను కూడా అశ్విన్ తీరుస్తున్నాడు. ఈ సీజన్‌లో అశ్విన్ 434 పరుగులు చేయడం అతని బ్యాటింగ్ ప్రదర్శనకు నిదర్శనం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.