యాప్నగరం

నెటిజన్లకి అడ్డంగా దొరికిపోయిన అశ్విన్

భారత జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక చిన్న పొరపాటుతో అభిమానులకి అడ్డంగా దొరికిపోయాడు.

TNN 17 Sep 2017, 4:06 pm
భారత జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక చిన్న పొరపాటుతో అభిమానులకి అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌లు ఆడుతున్న అశ్విన్ తాజాగా ఒక చైనా మొబైల్ కంపెనీకి సంబంధించిన ఫోన్‌ని ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ.. దాన్ని తన సొంత మొబైల్‌‌ ఫోన్‌ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే అతడ్ని చిక్కుల్లో పడేసింది.
Samayam Telugu ravichandran ashwin trolled for cross promotion of mobile brands
నెటిజన్లకి అడ్డంగా దొరికిపోయిన అశ్విన్


‘నా క్యారమ్ బంతి‌ని ఎదుర్కోవడంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 4 గురించి చర్చ అవసరమే లేదు’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. అయితే.. ఈ మెసేజ్‌ని తన సొంత ఐఫోన్ నుంచి ట్వీట్ చేయడంతో నెటిజన్లకి ఈ స్పిన్నర్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇదో ఫెయిడ్ ట్వీటని.. చైనా ఫోన్‌ని ప్రమోట్ చేస్తున్నాడని.. నీ చివరి వన్డే ఎప్పుడు ఆడావో గుర్తుందా.? ఇలా పలురకాలుగా అశ్విన్‌పై ధ్వజమెత్తారు. దీంతో అశ్విన్ వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేసినా.. అప్పటికే అది వైరల్‌గా మారిపోయింది. గతంలోనూ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇలాంటి తప్పిదంతో నెటిజన్ల వద్ద అడ్డంగా దొరికిపోయింది.
Ahem | @ashwinravi99 pic.twitter.com/Ea0aUKmePd — Shashank Rajaram (@shashankrajaram) September 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.