యాప్నగరం

IPL సన్నాహకంగా కౌంటీల్లో ఆడనున్న ఇండియన్ క్రికెటర్

ప్రస్తుతం టెస్టు జట్టులో మాత్రమే ఉన్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొద్దికాలం కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ప్రముఖ జట్టు యార్క్‌షైర్ తరపున తను బరిలోకి దిగనున్నాడు.

Samayam Telugu 16 Jan 2020, 7:20 pm
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సన్నాహకాలు చేస్తున్నాడు. ఈక్రమంలో మెగాటోర్నీకి ముందు టచ్‌లో ఉండటం కోసం కౌంటీ క్రికెట్ జట్టు యార్క్‌షైర్ తరపున ఆడనున్నాడు. ఐపీల్ స్టార్ట్ కావడానికి ముందు కొద్ది మ్యాచ్‌లు ఆడతాడు. అలాగే ఐపీఎల్ అనంతరం కాస్త విరామం అనంతరం మళ్లీ కౌంటీల్లో అశ్విన్ బరిలోకి దిగుతాడు.
Samayam Telugu BCCI LOGO


రవిచంద్రన్ అశ్విన్

Read Also : ఎంఎస్ ధోనీ కాంట్రాక్టుపై కొత్త ట్విస్ట్
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించిన యార్క్‌షైర్ తరపున ఆడనుండటంపై అశ్విన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 1992లో సచిన్ ఈ జట్టు తరపున ఆడి.. ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. యార్క్‌షైర్‌కు బలమైన ఫ్యాన్‌బేస్ ఉందని, ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఆడనుండటం చాలా ఆనందంగా ఉందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లో తను నాటింగ్‌హామ్ తరపున ఆడాడు.

Read Also : BCCI Troll: ధోనీకి కాంట్రాక్టు ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
కౌంటీల్లో అశ్విన్‌కు మంచి రికార్డే ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 34 వికెట్లు తీశాడు. అలాగే బ్యాట్‌తోనూ రాణించిన 37కుపైగా సగటుతో 300 పరుగులు సాధించాడు. అంతకుముందు సీజన్‌లో వర్సెస్టర్‌షైర్ తరపున ఆడిన 20 వికెట్లు తీయడంతోపాటు 42కు పైబడి సగటుతో పరుగులు సాధించాడు. ఒకప్పుడు భారత్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన అశ్విన్.. ప్రస్తుతం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. వచ్చేనెలలో న్యూజిలాండ్ టూర్‌లో ఇండియా రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం కౌంటీల్లో అశ్విన్ ఆడే అవకాశముంది. ఐపీఎల్ ముగిశాక మిగతా సీజన్‌‌కు తాను అందుబాటులో ఉంటాడని యార్క్‌షైర్ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇక గతేడాది ఐపీఎల్లో కింగ్స్ లెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అశ్విన్.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగనున్నాడు.

Read Also : వన్డే వరల్డ్‌కప్ భారత సూపర్ ఫ్యాన్ చారులత ఇకలేరు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.