యాప్నగరం

అశ్విన్ వికెట్ల జోరు వెనుక ‘కావేరి’..!

ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. అయితే కొన్ని కావేరీ జలాలు ఈ మధ్యనే తమిళనాడుకు వస్తున్నాయి.

TNN 9 Mar 2017, 1:32 pm
బంతిని గిరగిరా తిప్పుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టే భారత స్పిన్నర్ అశ్విన్‌‌ ఓ ఇబ్బందికర ప్రశ్నకు తనదైన రీతిలో బదులిచ్చాడు. బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అశ్విన్ ‘దిలీప్ సర్దేశాయ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ కావేరీ జలాల విషయమై అశ్విన్‌ను ఇబ్బందిపెట్టాలని చూశాడు. ‘కర్ణాటక నీటిలో ఏముంది అశ్విన్..? ఆ నీరు తాగి ఒకప్పుడు బీఎస్ చంద్రశేఖర్, ప్రసన్న, ఇప్పుడు నువ్వు ఇలా.. అత్యుత్తమ స్పిన్నర్లగా వెలుగులోకి వస్తున్నారు’ అని ప్రశ్నించాడు.
Samayam Telugu ravichandran ashwin wins hearts with a moving speech
అశ్విన్ వికెట్ల జోరు వెనుక ‘కావేరి’..!


నిజానికి అశ్విన్ తమిళనాడుకు చెందిన క్రికెటర్. కానీ.. ఇటీవల కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదాలు చెలరేగిన నేపథ్యంలో అతణ్ని ఇబ్బంది పెట్టాలని ఫరూఖ్ ఇంజినీర్ ఈ ప్రశ్న సంధించాడు. దీంతో అశ్విన్ కాసేపు షాకైనా.. తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. ‘నేనిక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అయితే కావేరీ జలాలు ఈ మధ్య తమిళనాడుకు వస్తున్నాయి. నా వికెట్ల జోరుకు అది కూడా ఓ కారణమేమో’ అని బదులిచ్చాడు. అతడి సమాధానంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. ఫరూఖ్ ఇంజినీర్‌ ఆటలు ఇంజినీరింగ్ చదువుకున్న అశ్విన్ ముందు సాగలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.