యాప్నగరం

భారత్ కోచ్ ఎంపిక కోసం డబ్బులు అడిగారా..?

గత ఏడాది భారత్ జట్టు ప్రధాన కోచ్‌‌ని ఎంపిక చేసే బాధ్యతను కూడా ఈ కమిటీనే సమర్థంగా నిర్వహించింది. దీంతో తాజాగా మళ్లీ కోచ్ ఎంపిక బాధ్యతను

TNN 11 Jun 2017, 4:26 pm
భారత్ జట్టు ప్రధాన కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు బీసీసీఐ నుంచి క్రికెట్ సలహా కమిటీ కొంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌరవ్ గంగూలీ, సచిన్ తెందుల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌‌తో కూడిన ఒక కమిటీని 2015లో బీసీసీఐ ఏర్పాటు చేసింది. దేశంలో క్రికెట్ వృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో బోర్డు చెప్పుకొచ్చింది.
Samayam Telugu remuneration to pick team india coach
భారత్ కోచ్ ఎంపిక కోసం డబ్బులు అడిగారా..?


గత ఏడాది భారత్ జట్టు ప్రధాన కోచ్‌‌ని ఎంపిక చేసే బాధ్యతను కూడా ఈ కమిటీనే సమర్థంగా నిర్వహించింది. దీంతో తాజాగా మళ్లీ కోచ్ ఎంపిక బాధ్యతను తీసుకున్న ఈ ముగ్గురు దిగ్గజాల బృందం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించేసినా.. తుది నిర్ణయం మాత్రం వెల్లడించలేదు. ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే బీసీసీఐ సీఈవోని రాహుల్‌‌ను కమిటీ సభ్యులు రెమ్యునరేషన్‌ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.

‘సాధారణంగా ఇలాంటి కమిటీకి ప్రత్యేకంగా జీతం, రెమ్యునరేషన్ రూపంలో బీసీసీఐ ఎలాంటి రుసుములను చెల్లించదు. కానీ.. కమిటీ సభ్యులు ఉండటానికి వసతి, రోజువారి భత్యం, మీటింగ్ సమయంలో కారు సౌకర్యం మాత్రం బోర్డు కల్పిస్తోంది’ అని బీసీసీఐ మాజీ అధికారి ఒకరు తెలిపారు. అసలు క్రికెట్ సలహా కమిటీ ఏర్పాటు ఉద్దేశం ‘ఆటకి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం’ అని ఆయన వివరించారు. రెమ్యునరేషన్ డిమాండ్ వార్తపై బీసీసీఐ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. కమిటీలో ఉన్న క్రికెట్ దిగ్గజాలకి అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.