యాప్నగరం

టీ20 ప్రపంచకప్‌ నాకౌట్ మ్యాచ్‌ల్లో మార్పులు?

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్ నాకౌట్‌ మ్యాచుల్లో రిజర్వుడేలను ఏర్పాటు చేయలేదు. దీంతో వర్షం కారణంగా సెమీస్‌లో ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టగా.. భారత ఫైన‌ల్‌కు దూసుకెళ్ళింది. ఈ విధానం ద్వారా లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Samayam Telugu 21 Mar 2020, 11:27 pm
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే పురుషుల‌ టి20 వరల్డ్ కప్‌లో నాకౌట్ మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డేల‌ను కేటాయించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. ఈ టోర్నీ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. అంతకు ముందు జరిగే ఐసీసీ క్రికెట్ క‌మిటీ సమావేశంలో రిజ‌ర్వ్ డేల‌పై చర్చించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. మీటింగ్లో ఈ విషయంపై చర్చ జరిగితే, నాకౌట్ మ్యాచ్‌లకు రిజ‌ర్వ్ డేల‌ను కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 మ‌హిళా ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డేలు లేకపోవడంపై గందరగోళం నెలకొంది.
Samayam Telugu The International Cricket Council (ICC) logo at the ICC headquarters in Dubai


Read Also: వాళ్లే అసలైన వైరస్‌లాంటివారు: బంగ్లా క్రికెట‌ర్‌

భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య‌ సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇంగ్లాండ్ ఇంటిముఖం ప‌ట్టగా.. టోర్నీలో అజేయంగా నిలిచిన‌ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీనిపై చాలా దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల‌కు సంబంధించి నాకౌట్ మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డేల‌ను కేటాయించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్ కమిటీ మీటింగ్‌లో ప్లేయింగ్ కండిషన్లపై మార్పులు చేర్పులకు సుముఖత వ్యక్తం అయితే, రిజర్వ్ డేల‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: నెద‌ర్లాండ్స్‌లో చిక్కుకుపోయిన భార‌త హాకీ ప్లేయ‌ర్లు

మరోవైపు ఐసిసి టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌ల్లో రిజర్వ్ డేల‌ను కేటాయించాలని వాదనపై సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. పురుష టోర్నీలో రిజ‌ర్వ్ డేల‌ను కేటాయించ‌డం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ల‌ స్పందన ఎలా ఉంటుందో అని వ్యాఖ్యానించారు. ఒక టోర్నీలో రిజ‌ర్వ్ డేల‌ను కేటాయించకుండా, మరో టోర్నీలో వీటిని కేటాయించడం సరికాదని ఎవ‌రైనా భావిస్తారు అనే విధంగా అన్నారు. మరోవైపు గత ఏడాది జ‌రిగిన‌ వన్డే వరల్డ్ కప్‌లో నాకైట్ మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డేల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.