యాప్నగరం

Ricky Ponting దశాబ్ధపు టెస్టు టీమ్.. కెప్టెన్ మనోడే

2010వ దశకం ముగిసిపోతున్న క్రమంలో చాలామందిలాగే ఆసీస్ లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ దశాబ్ధపు అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో కోహ్లీని కెప్టెన్‌గా ఎంచుకున్న పాంటింగ్.. ఇంగ్లాండ్ నుంచి నలుగురిని, ఆసీస్ నుంచి ముగ్గుర్ని తన జట్టులోకి తీసుకున్నాడు.

Samayam Telugu 30 Dec 2019, 7:16 pm
2010-19కి సంబంధించి అత్యుత్తమ టెస్టుటీమ్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రకటించాడు. ఈ టీమ్‌లో అందరినీ ఆశ్చరపరుస్తూ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు పెద్దపీట వేశాడు. ఏకంగా నలుగురు ఇంగ్లీష్ ప్లేయర్లుకు చోటు కల్పించిన పాంటింగ్.. తన సొంతదేశం నంచి ముగ్గురు ప్లేయర్లను ఎంచుకున్నాడు. ఇక ఈ టీమ్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంచుకోవడం విశేషం. భారత్‌తోపాటు శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల నుంచి ఒక్కో ఆటగాడిని పాంటింగ్ ఎంచుకోవడం విశేషం.
Samayam Telugu ricky ponting



Read Also : టెస్టు క్రికెట్‌లో పెనుమార్పులు.. ఫార్మాట్‌ మార్చే యోచనలో ఐసీసీ..!
సోషల్ మీడియాలో ప్రకటించిన ఈ జాబితాలో ఇంగ్లాండ్ నుంచి నలుగురు ప్లేయర్లు ఆలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ చోటు దక్కించుకున్నారు. వీరిలో కుక్ రిటైరవ్వగా.. మిగతా ముగ్గురు ప్రస్తుతం యాక్టివ్‌గానే ఉన్నారు. ఇక ఆసీస్ నుంచి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, నాథన్ లయోన్‌ను ఎంపిక చేశాడు. భారత్ నుంచి కోహ్లీ, లంక నుంచి కుమారా సంగక్కర, సౌతాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్, న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ ఎంపికయ్యారు.


Read Also : బంగ్లా టీమ్ పాక్ పర్యటనకి భారత్ అడ్డు: ఖురేషి
ఓపెనర్లుగా వార్నర్, కుక్‌లను ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో విలియమ్సన్, మిడిలార్డర్‌లో స్మిత్, కోహ్లీ, సంగక్కరలను సెలెక్ట్ చేశారు. సంగక్కరకు వికెట్ కీపర్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఆల్‌రౌండర్ కోటాలో స్టోక్స్, ఏకైక స్పిన్నర్‌గా లయోన్ను ఎంపిక చేశారు. పేసర్లుగా స్టెయిన్, బ్రాడ్, అండర్సన్‌కు ఓటేశాడు. మొత్తంమీద తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పాంటింగ్ ప్రకటించగా.. దీనికి నెటిజన్ల నుంచి మాంచి స్పందన లభిస్తోంది.

Read Also : టీవీ పగలగొట్టిన పాక్ క్రికెటర్.. దుమ్మెత్తిపోస్తున్న భారతీయులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.