యాప్నగరం

రిషబ్ పంత్ నీ బలాన్ని గుర్తించు: వీవీఎస్

భారత్ జట్టు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుండగా.. ధోనీ స్థానంలో టీ20ల్లోకి రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 13 Nov 2018, 5:57 pm
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొలుత తన బలాన్ని గుర్తించాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఆఖరి టెస్టు మ్యాచ్‌లో శతకం బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో వరుసగా 92, 92 పరుగులు చేసిన ఈ యువ వికెట్ కీపర్.. తాజాగా ముగిసిన ఆఖరి టీ20లోనూ మెరుపు అర్ధశతకం బాదేశాడు. కానీ.. కెరీర్‌లో జాగురతతో వ్యవహరించాలని పంత్‌కి లక్ష్మణ్ సూచించాడు.
Samayam Telugu Chennai: Indian cricketer Rishabh Pant plays a shot during the 3rd and final T20...
Indian cricketer Rishabh Pant plays a shot during the 3rd and final T20 match against West Indies in Chennai.Photo/R Senthil Kumar)


‘రిషబ్ పంత్ తన బలాలేమిటో ముందుగా అర్థం చేసుకోవాలి. అలా అయితేనే.. ఒడిదొడుకుల్ని తట్టుకుని నిలబడగలడు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హిట్టింగ్ చేయాల్సిందిగా పంత్‌కి సలహాలు వస్తున్నట్లున్నాయి. ఆ మేరకు అతను భారీ షాట్లు ఆడేస్తున్నాడు’ అని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు.

భారత్ జట్టు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుండగా.. ధోనీ స్థానంలో టీ20ల్లోకి రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.