యాప్నగరం

భారత్ టీ20 జట్టుకి ఆరో కెప్టెన్‌గా రోహిత్

భారత్ టీ20 జట్టుకి ఆరో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో కటక్‌ వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న తొలి

TNN 20 Dec 2017, 7:30 pm
భారత్ టీ20 జట్టుకి ఆరో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో కటక్‌ వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌‌‌తో రోహిత్ ఈ అరుదైన ఘనతని అందుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి పేరుతో వన్డే, టీ20 సిరీస్‌కి దూరమవగా.. రోహిత్‌ని తాత్కాలిక కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఓపెనర్ సారథ్యంలోని భారత్ జట్టు శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది.
Samayam Telugu rohit sharma becomes indias 6th t20i captain
భారత్ టీ20 జట్టుకి ఆరో కెప్టెన్‌గా రోహిత్


2006, డిసెంబరులో భారత్ టీ20 జట్టుకి తొలిసారి వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీ వహించగా.. 2007లో మహేంద్రసింగ్ ధోనీ పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత 2011లో వెస్టిండీస్‌ పర్యటనకి సురేశ్ రైనా, 2015 జింబాబ్వే పర్యటనలో రహానె టీమిండియా టీ20 జట్టుకి తాత్కాలిక సారథ్యం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి వన్డే, టీ20 పగ్గాలని విరాట్ కోహ్లి అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సెహ్వాగ్, ధోనీ, సురేశ్ రైనా, రహానె, కోహ్లి తర్వాత ఆరో టీ20 కెప్టెన్‌ రోహిత్ నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.