యాప్నగరం

రోహిత్‌ను హగ్ చేసుకొని, కిస్ చేసిన అభిమాని

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. హిట్ మ్యాన్‌ను హత్తుకొని హెల్మెట్ మీది నుంచే ముద్దాడటానికి ప్రయత్నించాడు.

Samayam Telugu 15 Oct 2018, 8:16 pm
తమ ఆరాధ్య క్రికెటర్లను తాకడానికి, వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం భద్రతా సిబ్బంది కన్నుగప్పి రెప్పపాటులో మైదానంలోకి పరిగెత్తుకొస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఓ అభిమాని గ్రౌండ్లో కోహ్లితో సెల్ఫీ దిగడానికి ట్రై చేశాడు. తాజాగా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
Samayam Telugu rohit kiss


విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరఫున రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ వీరాభిమాని మైదానంలోకి పరిగెత్తుకొచ్చాడు. అతణ్ని హత్తుకొని హెల్మెట్ మీది నుంచే ముద్దాడటానికి ప్రయత్నించాడు. పాదాలకు నమస్కరించి.. మళ్లీ హత్తుకొని, ముద్దాడే ప్రయత్నం చేశాడు. రోహిత్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రపంచాన్నే జయించినోడిలా.. ఆనందంతో గంతులేస్తూ మైదానం వీడాడు.
ముంబై, బిహార్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం అభిమాని రోహిత్‌ను ముద్దాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.