యాప్నగరం

IND vs WI 3rd T20I లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. జడేజా ఔట్

West Indies vs India, 3rd T20I లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. సోమవారం రాత్రి జరిగిన రెండో టీ20లో అనూహ్యరీతిలో ఫెయిలైన టీమిండియా.. పేలవంగా ఓడిపోయింది. దాంతో.. ఈరోజు మ్యాచ్‌‌తో సిరీస్‌లో పుంజుకోవాలని...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 2 Aug 2022, 9:24 pm

ప్రధానాంశాలు:

  • మూడో టీ20లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ
  • వెస్టిండీస్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్
  • భారత్ తుది జట్టులో ఒక మార్పు
  • టీ20 జట్టులోకి దీపక్ హుడా రీఎంట్రీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu West Indies vs India, 3rd T20I (Pic Credit: BCCI/Twitter)
West Indies vs India, 3rd T20I (Pic Credit: BCCI/Twitter)
India vs West Indies 3rd T20I: వెస్టిండీస్‌తో సెయింట్ కిట్స్ వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే వేదికగా సోమవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్‌పై 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. దాంతో.. ఐదు టీ20ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది.
భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి రెస్ట్ ఇవ్వడంతో.. అతని స్థానంలో దీపక్ హుడా టీమ్‌లోకి వచ్చాడు. బ్యాటర్‌గానే కాదు.. ఉపయుక్తమైన స్పిన్నర్‌గానూ దీపక్ హుడా ఇటీవల సత్తాచాటుతున్నాడు. వెస్టిండీస్ తుది జట్టులోనూ ఒక మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ ఓడెన్ స్మిత్ స్థానంలో డొమినిక్ డ్రాక్స్ టీమ్‌లోకి వచ్చాడు.

మూడో టీ20కి భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్

విండీస్ టీమ్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రొవ్‌మెన్ పొవెల్; సిమ్రాన్ హెట్‌మెయర్, దేవాన్ థామన్, జేసన్ హోల్డర్, అకేల హొసెన్, డొమినిక్ డ్రాక్స్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.