యాప్నగరం

కంగారూలపై రోహిత్ ‘క్లాస్’ శతకం వీడియో

ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం ముగిసిన చివరి వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ క్లాస్ శతకం బాది భారత్‌ని

TNN 2 Oct 2017, 2:57 pm
ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం ముగిసిన చివరి వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ క్లాస్ శతకం బాది భారత్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 243 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ (125: 109 బంతుల్లో 11x4, 5x6) దూకుడు‌గా ఆడటంతో టీమిండియా 42.5 ఓవర్లలోనే 243/3తో ఛేదించేసింది. మరో ఓపెనర్ అజింక్య రహానె (61)తో కలిసి తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. రెండో వికెట్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లి (39)‌తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Samayam Telugu rohit sharmas match winning century india vs australia
కంగారూలపై రోహిత్ ‘క్లాస్’ శతకం వీడియో


బెంగళూరు వన్డేలో కీలక సమయంలో తాను ఔటవడంతో భారత్ ఓటమిపాలైన నేపథ్యంలో నాగ్‌పూర్ వన్డేలో రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. ముఖ్యంగా తొలి ఓవర్లలో మరీ అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. ఎంతలా అంటే అతను ఖాతా తెరిచేందుకు సుమారు పదికి పైగా బంతులను తీసుకున్నాడు. అయితే.. క్రీజులో కుదురుకున్న తర్వాత ఈ ఓపెనర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మాటల్లో చెప్పాలంటే.. టెక్ట్స్‌బుక్ షాట్స్, నటరాజ భంగిమలో రోహిత్ బాదిన ఫోర్లు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాయి. చివరికి సిక్స్‌తో శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ ఇన్నింగ్స్‌‌ని మీరూ ఒకసారి వీక్షించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.