యాప్నగరం

​ టేలర్ వెళ్తూ.. ఆ సీక్రెట్ చెప్పేశాడు..!

న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ స్వదేశానికి వెళ్తూ.. భారత అభిమానుల్ని గత కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్న ఓ సీక్రెట్‌ని రివీల్

TNN 9 Nov 2017, 4:36 pm
న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ స్వదేశానికి వెళ్తూ.. భారత అభిమానుల్ని గత కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్న ఓ సీక్రెట్‌ని రివీల్ చేసేశాడు. అక్టోబరు 22న వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో టామ్ లాథమ్‌తో కలిసి రాస్ టేలర్ ద్విశత భాగస్వామ్యం నెలకొల్పి కివీస్‌ని గెలిపించాడు. ఈ భాగస్వామ్యంపై సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాస్ టేలర్‌ని దర్జీతో పోల్చాడు. బట్టలు కుట్టడంలోనైనా.. భాగస్వామ్యం నిర్మించడంలోనైనా.. నీ తర్వాతే ఎవరైనా అంటూ చమత్కారంగా ప్రశంసించాడు. దీనికి టేలర్ కూడా హిందీలో సరదాగా స్పందించడంతో అప్పట్లో ఈ ట్వీట్స్‌ వైరల్‌గా మారాయి.
Samayam Telugu ross taylor thanks new zealand teammates for helping him tackle twitter banter with virender sehwag
​ టేలర్ వెళ్తూ.. ఆ సీక్రెట్ చెప్పేశాడు..!


సెహ్వాగ్‌ ట్వీట్స్‌‌కి దీటుగా టేలర్ స్పందించడం కంటే.. అతను హిందీలో రిప్లై ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌ క్రికెటర్‌కి హిందీ ఎలా వచ్చిందబ్బా..? అతనికి ఎవరు సాయం చేసుంటారు అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో ఆరాతీయడం మొదలెట్టారు. మంగళవారం రాత్రి సిరీస్‌ ముగియడంతో తాజాగా స్వదేశానికి పయనమైన టేలర్.. తనకి హిందీ నేర్పిన వ్యక్తుల్ని అభిమానులకి పరిచయం చేశాడు. అందులో ఒకతను జట్టులో సహచరుడైన ఇస్ సోధీ కాగా.. మరొకతను జట్టు సహాయ సిబ్బందిలో ఒకరు దేవ్. ఇస్‌ సోధీ‌ కుటుంబం పంజాబ్‌ నుంచి న్యూజిలాండ్‌కి వలసపోగా.. దేవ్‌ కూడా భారత్ సంతతికి చెందిన వ్యక్తేనని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.