యాప్నగరం

IND vs SA: గంగూలీ, ద్రవిడ్ రికార్డ్‌‌పై కన్నేసిన విరాట్ కోహ్లీ.. జస్ట్ 27 రన్స్

భారత జట్టు పగ్గాల్ని పూర్తిగా వదిలేసిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత తొలిసారి వేరొకరి కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనుండగా...

Samayam Telugu 18 Jan 2022, 6:41 pm

ప్రధానాంశాలు:

  • దక్షిణాఫ్రికా గడ్డపై అరుదైన రికార్డ్ ముంగిట కోహ్లీ
  • కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగిన విరాట్
  • బుధవారం బొలాండ్ పార్క్‌లో తొలి వన్డే
  • మూడు వన్డేల ఈ సిరీస్‌‌లో కోహ్లీ 27 పరుగులు చేస్తే?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Virat Kohli (Pic Credit: AFP)
దక్షిణాఫ్రికా గడ్డపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్‌కి 27 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బొలాండ్ పార్క్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి ఫస్ట్ వన్డే మ్యాచ్ జరగనుండగా.. ఈ మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ 27 పరుగులు చేస్తే? భారత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ రికార్డ్‌‌లు బ్రేక్‌కానున్నాయి. ఐదు నెలల వ్యవధిలోనే టీ20, వన్డే, టెస్టు టీమ్ పగ్గాలు వదిలేసిన విరాట్ కోహ్లీ.. ఇకపై మూడు ఫార్మాట్లలోనూ కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడనున్నాడు.
కెప్టెన్సీ భారాన్ని వదిలేసిన విరాట్ కోహ్లీ.. తొలి వన్డేలో స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో తొలిసారి ఆడబోతున్న విరాట్ కోహ్లీ.. నెం.3లో బ్యాటింగ్ చేయడం లాంఛనంగా కనిపిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 1287 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మరో 27 పరుగులు చేస్తే? సఫారీలపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాని పరిశీలిస్తే? సౌరవ్ గంగూలీ 1313 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 1309 పరుగులతో ఉన్నాడు.

ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 1879 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 1789 పరుగులతో ఉండగా.. విరాట్ కోహ్లీ మరో 27 పరుగులు చేస్తే? మూడో స్థానానికి ఎగబాకనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 1287 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.